Listen to this article

జనం న్యూస్ 18 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంకల్ప రథం ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని SP వకుల్‌ జిందల్‌ శనివారం తెలిపారు. జనవరి 1 నుంచి మే 14 వరకు 155 పాఠశాలలను సందర్శించి 32,226 మంది విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలను వివరించామన్నారు. 196 ప్రధాన కూడళ్లలో 18,953 మంది ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. రోజుకో మండలంలో సంకల్ప రథం పర్యటిస్తుందని చెప్పారు.