

జనం న్యూస్ జనవరి 22 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ : కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.కె సైదా అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలో పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..21 తారీకు నుండి 24 తారీకు వరకు జరుగు గ్రామ సభల్లో కౌలు రైతుల గుర్తించి వారికి రైతు భరోసా కల్పించాలని కోరుచున్నాము గతంలో ఉన్న ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ఏరియా) కౌలుదారి చట్టం తేవడం జరిగినది ఆదికృత లైసెన్స్ రైతుల చట్టం-2011 లో కౌలు రైతుల చట్టం తేవటం జరిగినది ప్రస్తుతం 2011 భూ ఆదికృత చట్టం అమల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అంగీకరించింది .కానీ గత ముఖ్యమంత్రి ఈ చట్టాన్ని అమలు చేయనాని రాష్ట్రంలో కౌలుదారు లేరని శాసనసభ పక్షంగా ప్రకటించారు.చివరకు పహానిలో రికార్డు నుండి కౌలుదారులను వాస్తవ సాగు దారులను తొలగించినారు. ప్రస్తుత ప్రభుత్వము ఎన్నికల ముందు కౌలు రైతులను గుర్తిస్తామని వారికి కూడా రైతు భరోసా రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పటం జరిగినది .ఈ ప్రభుత్వం రేపు జరగబోయే గ్రామ సభలలో రైతు భరోసా రైతులకు ఇచ్చినట్టుగాను కౌలు రైతులకు కూడా ఇవ్వాలని మరియు కౌలు రైతులకు ప్రభుత్వ. 1 పంటల బీమా 2 రైతు భరోసా 3 రైతు బీమా 4 సబ్సిడీ ఇవ్వాలి గ్రామ సభల ద్వారా మాత్రమే కౌలు రైతులను గుర్తించాలి రుణ అర్హత కార్డులను ఇవ్వాలని బ్యాంకుల ద్వారా కౌలు రైతులకు రుణాలు కల్పించాలి. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పంటల పరిహారం ఇవ్వాలి. 2011 చట్ట ప్రకారం కౌలు రైతులకు లోన్ ఎలిజి బుల్ కార్డు లు ఇవ్వాలి. ఎన్నికల్లో మేనిఫెస్టో ప్రకటించిన విధంగా కౌలు రైతులకు రైతు భరోసా రైతు బీమా పంటల భీమ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు .