

నివాళి అర్పిస్తున్న సిపిఎం నాయకులు*
జనం న్యూస్ మే 19 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం దామరగిద్ద: మండల పరిధిలోని ముస్తాపేట గ్రామంలో సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చల పల్లి సుందరయ్య. నాలుబై వ వర్ధంతి నీ ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి అంజిలయ్య గౌడ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని అలాగానిపాడు లో జన్మించిన కామ్రేడ్ సుందరయ్య భూస్వామ్య కుటుంబంలో జన్మించిన తనకున్న భూమిని పేదలకు పంచి నిరాడంబరంగా తన యొక్క జీవితాన్ని కొనసాగించిన మహోన్నత వ్యక్తి,పేద ప్రజల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు కామ్రేడ్ సుందరయ్య అని కొనియాడారు.ప్రజాప్రతినిధిగా ఎంపీ,ఎమ్మెల్యే గా పార్లమెంటు అసెంబ్లీలలో నిరంతరం ప్రజల సమస్యల పైన పాలక పార్టీలను నీలేసి పేదలకు కార్మికుల పక్షాన గళం విప్పిన పోరాట యోధుడు అని కొనియాడారు.రాజకీయ పార్టీలకు అతీతంగా నెహ్రూ లాంటి వ్యక్తులే ప్రశంసించిన గొప్ప వ్యక్తి అని. అన్నారు ప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వo ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని వాటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస