

జనం న్యూస్ మే 19: నిజామాబాద్ ఏర్గట్ల
మండలంలోని బట్టాపూర్ గిరిజన తాండ లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత ఆలయాలు నిర్మించి నాలుగు వసంతాలు పూర్తి అయినా సందర్బంగా సోమవారంరోజునా గిరిజనులు ఆలయ నాలుగవ వార్షికోత్సవమును జరిపి తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా సంఘ సభ్యులు మాట్లాడుతూ.. తమ బంజారుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జగదంబ మాత ఆలయాలు నిర్మించుకున్నామని ప్రతి సంవత్సరం ఆలయం ముందర భోగ బండార్, ప్రత్యేక పూజల కార్యక్రమం నిర్వహించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు ఎక్కువ గా పడి పంటలు పండాలని మేము వేడుకుంటామని అన్నారు. ప్రతి ఒక్కరు సేవాలాల్ మహారాజ్ అడుగుజాడలో నడవాలని శాంతితో ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బంజర సంఘ సభ్యులు, గ్రామస్తులు, భక్తులుమరియు తదితరులుపాల్గొన్నారు.