Listen to this article

మండల విద్యాధికారి పి విట్టల్

జనం న్యూస్ మే 20 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా
స్థానిక కేజీబీవీ చిట్కుల్ పాఠశాలలో ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు మండల విద్యాధికారి విటల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి మాట్లాడుతూ ఈ శిక్షణ ఉపాధ్యాయులకు ఎంతో మేలు కలుగుతుందని తద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు అదే విదంగా ఈ శిక్షణలో తీసుకోవలసిన మెలకువలు, శిక్షణ యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులందరికీ తెలియజేసి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపారు. జూన్ నెలలో చేపట్టబోయే బడిబాట కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పథంలో నడపాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులందరూ సకాలంలో హాజరై రిసోర్స్ పర్సన్ లు చెప్పే విషయాలను నోట్ చేసుకొని ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది