

సబ్ జూనియర్ నెట్ బాల్ బాలికల విభాగంలో నల్లగొండ జిల్లా జట్టుకు రెండవ స్థానం
జనం న్యూస్ – మే 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
జనగామ జిల్లా బతుకమ్మ కుంట స్టేడియంలో ఈనెల 15, 16, 17, 18 వ తేదీలలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్ బాల్ టోర్నమెంట్ బాలికల విభాగంలో నల్లగొండ జిల్లా జుట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచి రెండవ స్థానం సాధించారని, నల్లగొండ జిల్లా జట్టు రెండవ స్థానం సాధించడంలో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థులు కీలక పాత్ర పోషించారని ఉమ్మడి నల్లగొండ జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ జె కిరణ్ కుమార్ తెలిపారు, ఈరోజు స్థానిక సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్ బాల్ టోర్నమెంట్ బాలికల విభాగంలో పాల్గొన్న క్రీడాకారులను నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్, ఉమ్మడి నల్లగొండ జిల్లా కబాడీ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి కర్తయ్య, సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ లలిత, సిస్టర్ మాతీన మరియు పాఠశాల పిఈటి జె కిరణ్ కుమార్ లు అభినందించారు.