

నిర్వహించిన హనుమాన్ మాల ధారణ స్వాములు..
జనం న్యూస్ 21 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ మాల ధారణ స్వాములంతా స్వామివారి చిత్రపటంతో డీజె చంపుల్లతో వాడ వాడ తిరగగా భక్తులంతా ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి పూజలు చేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వాములు మాట్లాడుతూ. గత సంవత్సరం కూడా ఇలాగే హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించామని స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ గ్రామ ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామంలో శోభయాత్ర నిర్వహించామని తెలిపారు.