Listen to this article

కెవిపిఎస్ డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో*

*జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కి వినతి*

జనం న్యూస్ మే 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న (డి ఏ ఓ ) రావూరి శ్రీనివాస్ నకిలీ ఎస్సీ సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందారని అనేక ఆరోపణలు వస్తున్న క్రమంలో కెవిపిఎస్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆ అధికారిపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కి వినతి పత్రం అందజేయడం జరిగింది, సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారిగా (డి ఏ ఓ) విధులు నిర్వహిస్తున్నారు, అయితే తాను ఎస్సీ అని అందరి ఉన్నత అధికారులను నమ్మించి ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అతని కులం పేరు ఎక్కడ ప్రస్తావించకుండా చాలా రహస్యంగా గోప్యంగా ఉంచుతూ తన అసలు కులం బయటపడకుండా కప్పిపుచ్చుతున్నారని నకిలీ ఎస్సీ గా చలమణి అవుతూ తన కిందిస్థాయి అధికారులను ఎస్సీ కులం పేరుతో దుర్భాషలాడుతున్నారని విన్నవించారు, అయితే తాను హరిజన ఎస్సీ అంటూ రాష్ట్రంలో ఉన్న అధికారులను తప్పుతవ పట్టిస్తున్నాడు, సదురు అధికారి ఒకే చోట పది సంవత్సరాల పైగా విధులు నిర్వహిస్తూ ఎప్పుడు కూడా తన విధుల్లో భాగంగా ఫీల్డ్ విజిట్ కి వెళ్ళిన దాఖలాలు లేవు పైగా క్రింది స్థాయి పనిచేసే ఉద్యోగాలపై తన పెత్తనం చెల్లాయిస్తూ మానసికంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, కావున అధికారిపై పూర్తి విచారణ జరిపించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వాటితోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు, జిల్లా కలెక్టర్ గ స్పందిస్తూ తక్షణమే అధికారిపై విచారణ జరిపిస్తామని విచారణ తేలిన దానిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు, ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టీకానంద్, గోడిసెల కార్తీక్ , డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చాపిడి శ్రావణి , దుర్గం నిఖిల్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు జాడి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు,