

( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జారపు శ్రీనివాస్)
జనం న్యూస్, మే 22, జగిత్యాల జిల్లా, కోరుట్ల : కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణానికి చెందిన 9,67,000/- తొమ్మిది లక్షల ఆరవై ఏడువేళ రూపాయల విలువగల 35 సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు కోరుట్ల మండలానికి చెందిన 5,20,000/- ఐదు లక్షల ఇరవైవేళ రూపాయల విలువగల 19 సీఎంఆర్ చెక్కులు మొత్తం కలిసి 1,487,000/- పద్నాలుగు లక్షల ఎనభై ఏడువేళ రూపాయల విలువగల 54 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఈ రోజు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందచేయడం జరిగింది, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ మన నియోజకవర్గ ప్రజలకి ఆపద వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని చెప్పారు ఇట్టి కార్యక్రమంలో లబ్ధిదారులు మరియు బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు