

జనం న్యూస్ జనవరి 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోసమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆసిఫాబాద్ మండల కేంద్రం లో నియోజక వర్గ అధ్యక్షులు జాడి రవిదాస్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజల వజ్రాయుధమని, సహా చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యలయాల్లో పారదర్శకత, జవాబుదారితనం సహచట్టం తోనే సాధ్యమన్నారు. సహ చట్టం కార్యకర్త ప్రతి ఒక్క అంశం పైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం సమన్వయంతో సహ చట్టాన్ని బలోపేతం చేయడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్క సభ్యులు ప్రభుత్వ యంత్రం గానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం స.హ రక్షణ చట్టం-2005 ఆసిఫాబాద్ మండల నూతన కమిటీని నియమించారు.నూతన మండల కమిటీ వివరాలుమండల అధ్యక్షులు దుర్గం సుధాకర్, ఉపాధ్యక్షులు మల్కాడి శ్రీనాథ్, ప్రధాన కార్యదర్శి కాట్కార్ భీమ్రావు, సహాయ కార్యదర్శి జనార్ధన్, కోశాధికారి షేక్ జాఫర్ షరీఫ్ లను నియమించారు. అనంతరం వారికి నియామక పత్రాలను అందజేశారు.