Listen to this article

జనం న్యూస్ జనవరి 21 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లోని తుంగూరు గ్రామాన్ని ప్రత్యేక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ఏర్పాటు చేయాలని తుంగూరు గ్రామ రైతులంతా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని స్పెషల్ ఆఫీసర్ దేవప్రసాద్ కి వినతిపత్రం అందించారు. మండలంలో ఇప్పటికే రెండు వ్యవసాయ సహకార సంఘం సొసైటీ లు ఉండగా గతంలో తుంగూరు గ్రామం కూడా వ్యవసాయ సహకార సంఘం సొసైటీ గా ఉండేది తర్వాత రోజులలో మండలంలో కొల్వాయి, బీర్పూర్ లలో రెండు వ్యవసాయ సహకార సంఘం సొసైటీ మాత్రమే ఏర్పాటు అయినాయి. జనాభా పెరుగుదలతో మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ గా తుంగూరు గ్రామం ఉండగా అత్యధిక జనాభా కలిగి ఉన్న గ్రామం ఇప్పుడు రైతులంతా తమ దగ్గరలో ఉందా? మరో నాలుగు గ్రామాలను కలిపి ప్రత్యేక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ.ఏర్పాటు చేస్తే రైతులందరికీ గొప్ప మేలు చేసిన వారవుతారని ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుందని తుంగూరు గ్రామ రైతులు తెలుపుతున్నారు. ప్రభుత్వం జగిత్యాల జిల్లాలో నూతనంగా 10 వ్యవసాయ సహకార సంఘం లు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చినరని ప్రతిపాదించిన ప్రకారం తుంగూరు గ్రామంలో చుట్టూ ఉన్న గ్రామాలను కలుపుకొని ప్రత్యేక వ్యవసాయ సహకార ఏర్పటు చేయాలని మండల స్పెషల్ ఆఫీసర్ ద్వారా తమ గ్రామానికి ప్రతిపాదించిన వ్యవసాయ సహకార సొసైటీని కచ్చితంగా ఏర్పాటు చేసేందుకు కలెక్టర్, ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లి వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ఏర్పడకు ఖచ్చితమైన చర్యలు తీసుకొని కచ్చితంగా ఏర్పాటు చేయాలని గ్రామ రైతులు విజ్ఞప్తి చేశారు. తుంగూరు చుట్టూ ప్రక్క గ్రామాల రైతులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కళ వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ఏర్పాటు అని అటువంటి వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ఏర్పాటుకు ఇప్పుడు అవకాశం వచ్చిందని కచ్చితంగా తుంగూరులో వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ఏర్పాటు చేయాల్సిందేనని రైతులు తెలుపుతున్నారు. వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ఏర్పాటుకు సంబంధించి వినతిపత్రం అందించిన వారిలో తుంగూరు గ్రామ రైతులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, వ్యవసాయ సహకార సంఘం సొసైటీ డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.