

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
మూడు సంవత్సరాలు అవినీతి జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు ప్రజలు అవకాశం ఇచ్చింది అవినీతి రహిత, పారదర్శక పాలన కోసమే చైర్మన్ అప్పట్లోనే చర్యలు తీసుకుంటే ప్రజాధనం దుర్వినియోగం అయ్యేదా టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు షేక్ జమాల్ బాష చిలకలూరిపేట: మున్సిపాలిటీలో లక్షల రూపాయాల అవినీతి చోటు చేసుకుంటే, తనకు ఎటువంటి ప్రమోయం లేదని, తన వల్ల అవినీతి నిలిచి పోయిందని చైర్మన్ రఫాని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు షేక్ జమాల్ బాష విమర్శించారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గతంలో చైర్మన్ బాధ్యతులు చేపట్టినప్పటి నుంచి అవినీతికి బీజం ఏర్పడిందని, అక్కడి నుంచి మూడు సంవత్సరాల ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లక్షల రూపాయల అవినీతికి పాల్పడితే తనకు తెలియదని చైర్మన్ ప్రకటించటం చూస్తుంటే అతను ఎంత నటుడో అర్ధమౌతుందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో, తాను చైర్మన్‌గా ఉన్నప్పుడు అవినీతి జరిగితే, అతను పార్టీ మారి కూటమి ప్రభుత్వ ఏర్పాటయ్యాక మాత్రమే కుంబకోణానికి పాల్పడిన ఔట్‌సోర్పింగ్ ఉద్యోగిపై కేసు నమోదు చేశారని గుర్తు చేశారు.కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యేగా గెలుపుపొందాక ప్రజలకు పారదర్శక పాలన అందించాలన్న సంకల్పంతో వ్యవహరించారని తెలిపారు. ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉండలని, అభివృద్ది, సంక్షేమంలో రాజీ పడకుండా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పనిచేస్తున్న క్రమంలోనేఅవినీతి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ప్రారంభమైందన్నారు. అప్పుడు మాత్రమే చైర్మన్ నోరు విప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఒక్క రోజులో జరిగిన వ్యవహారం కాదని, తాను పదవి చేపట్టినప్పటి నుంచి కొనసాగిన అవినీతి కుంబకోణమని వెల్లడించారు. అప్పట్లో ఒక్కసారైనా ఈ వ్యవహారంపై అప్పట్లో స్పందించి ఉంటే కొద్ది ప్రజా ధనాన్ని మాత్రమే కోల్పొయి ఉండేదని పేర్కొన్నారు. మున్సిపల్ ఉద్యోగుల వ్యవహారం తనకు ఎలా తెలుస్తుందని చైర్మన్ అమాకంగా ప్రశ్నిస్తున్నారని, ప్రజలు ప్రధమ పౌరుడిగా అవకాశం ఇచ్చిందీ అవినీతిని అంతం చేసి స్వచ్చమైన, పారదర్శకమైన పాలన అందించాటానికేనని చెప్పారు. కాని మున్సిపాలిటీ పరిధిలో ఇంతటి అవినీతి చోటు చేసుకుంటే దానిని ఆపటానికి ప్రయత్నం చేయలేదని, నాటి మంత్రి, మంత్రి మరిది చెప్పిన ప్రతి మాటకు తల ఊపుతూ మున్సిపాలిటీని అవినీతి మయం చేశారని మండిపడ్డారు. తప్పు చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై ఈ ఏడాది జనవరి వరకు కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. చిన్న కేసులోనే ముద్దాయిలను రోజుల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేస్తున్నారని, దొంత సొత్తును రికవరీ చేస్తున్నారని అటువంటిదీ మూడు సంవత్సరాల పాటు ప్రజాధనాన్ని లూటీ చేసిన ఉద్యోగిని ఎందుకు అరెస్టు చేయలేదని , ప్రజా ధనాన్ని రికవరీ చేయలేదని ప్రశ్నించారు. ఔట్ సోర్పింగ్ ఉద్యోగిని గతంలో కొంతమందిపై అరోపణలు చేసిందని, తన అవినీతిలో కొంతమందికి భాగస్వామ్యం ఉందని పోలీసు స్టేషన్‌లో కేసు కూడా పెట్టిందని గుర్తు చేశారు. ఆమెను అరెస్టు చేస్తే కొంతమంది భాగోతం గుట్టు రట్టు అవుతుందని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. ప్రజా సేవ చేయటానికి ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు నీతితో నిజాయితీతో, పారదర్శకంగా పాలన చేయాలని, ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేయాలని, అప్పుడే ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని చెప్పారు. ముసుగులు వేసుకొని రాజకీయంచేస్తే, ప్రజా క్షేత్రంలో ముసుగులు తొలగించి ప్రజలు బుద్ది చెబుతారని జమాల్ బాష తెలిపారు.