

జనం న్యూస్. జనవరి 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్)హత్నూర మండలం సిరిపుర గ్రామంలోని పశు వైద్యశాలో మందుల నిలువల కోసం ఉపయోగపడే విధంగా స్థానిక గ్రామస్తుడైన స్వర్గీయ గోపాల్ మల్లేష్ యాదవ్. జ్ఞాపకార్ధంగా వారి కుమారులు మహేష్ యాదవ్, సురేష్ యాదవ్. ఫ్రిజ్జును బహుమతిగా ప్రధానం చేశారని పశు వైద్యశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. వైద్యశాల సిబ్బంది గ్రామస్తులతో కలిసి ఘనంగా పూలమాల శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో. డాక్టర్ సంధ్యారాణి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, బి. రాజ మల్లయ్య. వెటర్నరీ అసిస్టెంట్ ఆయుష్. డాక్టర్ మంజీరా. నూతనంగా పదోన్నతలు పొందిన ఎస్సై రాములు,పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మచ్చ నరేందర్ గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.