

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్,మే22,అచ్యుతాపురం
జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో వెలసి యున్న గ్రామ దేవత పెద్ద అమ్మోరు శ్రీ గంటాలమ్మ అమ్మవారి పండుగను గ్రామ పెద్దలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు అమ్మవారికి పూజలు చేసేందుకు భక్తులు ఉదయం నుంచే క్యూకట్టారు. భక్తులు ఇబ్బందులు పడకుండా నిర్వాహకులు,ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు.రాత్రికి భారీ మందుగుండు సామగ్రి, డాన్స్ బేబీ డాన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని వేద పండితులతో ఆశీర్వాదం స్వీకరించి అర్చకులుచే ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,యువకులు తదితరులు పాల్గొన్నారు..