

ఆశ వర్కర్స్ పది కిలోమీటర్లు పాదయాత్ర
జనం న్యూస్ జనవరి 2 1 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఫిబ్రవరి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్లకు కనీస వేతనం 18000 నిర్ణయం చేయాలని మంగళవారం బుర్గుడా గ్రామం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్ర సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం. శ్రీనివాస్ ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అనంతరం వినతిపత్రం అందజేశారు.పాదయాత్ర ను ప్రారంభించి న సిఐటియు జిల్లా కార్యదర్శి ముంజం. శ్రీనివాస్ మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులు సమ్మె చేస్తే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేస్తామని ఐఏఎస్ కమిటీని ఏర్పాటు చేసి పక్కన పెట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు మేనిఫెస్టో ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని,ఈఎస్ఐ, పిఎఫ్ ,ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఓట్లను దండుకున్నది.ఆశా వర్కర్స్ పోరాట ఫలితంగా 2024 ఫిబ్రవరి 9న, జులై 30న, డిసెంబర్ 10న ఆరోగ్యశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశాల ధర్నా చర్చల సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ 50 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చులు 50 వేలు ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సెలవులు ఇస్తామని, టార్గెట్ రద్దు చేస్తామని నిర్దిష్ట హామీలిచ్చారు. పై సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారు.అందుకని ఫిబ్రవరి 2 నుండి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం 18000 నిర్ణయం చేయాలి.
ఏఎన్ఎం ట్రైనింగ్ తీసుకున్న ఆశాలకు ఏ ఎన్ యం పోస్టుల్లో ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలి. వెయిటేజ్ మార్కులు వెంటనే నిర్ణయం చేయాలి. గత 15 రోజుల సమ్మే హామీలు, కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలు, కమిషనర్ హామీలను వెంటనే అమలు చేయాలి.డిసెంబర్ 10న ఇచ్చిన హామీ ప్రకారం ఏ ఎం సీ తదితర టార్గెట్స్ ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలి. ఇస్తున్న పారితోష్కల సగం పెన్షన్ నిర్ణయించాలి. ఆశాలకు ప్రతి సంవత్సరం 20 రోజులు వేతనంతో కొట్టిన సెలవులు ఇవ్వాలి. ఆశాలు చేస్తున్న పారితోషం లేని పనులురాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. పెండింగ్లో ఉన్న ఏరియాస్ ను వెంటనే విడుదల చేయాలి. లెప్రసీ, పల్స్ పోలియో డబ్బులు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశలకు రెస్ట్ రూం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆశ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరం. పద్మ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను గత 19 సంవత్సరాల నుండి అనేక అవస్థలు ఎదుర్కొంటూ ప్రభుత్వాలతో పోరాటాలు చేస్తున్నాం. పోరాటాలకు స్పందించని ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పిన చరిత్ర ఆశా కార్యకర్తలకు ఉన్నది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టో పెట్టిన హామీని నెరవేర్చాలి. అప్పటివరకు మా పోరాటం కొనసాగుతుంది. పాదయాత్రతో పోరాటం మొదలు చేశాం.దీన్నే స్ఫూర్తిగా ఆయుధంగా మలుచుకొని రాబోయే బడ్జెట్ సమావేశాల సందర్భంగా దఫా దఫాలుగా అనేక ఆందోళన కార్యక్రమాలు, దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజేందర్. జిల్లా కమిటీ సభ్యులు రామాచారి. డి వై ఎఫ్ ఐ జిల్లా టీకానంద్. నాయకులు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు స్వరూప.వనిత. మొగురా. నవీన. ,భారతి, లక్ష్మి,సరోజ. దేవి.పంచశీలా.భీమ్ బాయి. శ్రీలత.మైన.తదితరులు పాల్గొన్నారు.