

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 21తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లె మరియు కొండారెడ్డిపల్లె గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ పంట జరిగిన రైతులందరూ ఈకేవైసీ కూడా తప్పనిసరిగా చేయించుకొనవలెనని కోరారు. అలానే రేపటినుండి “ఫార్మర్ రిజిస్టి” కార్యక్రమాన్ని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో మొదలవుతుందని రైతులందరూ నమోదు చేసుకొనవలెనని తెలిపారు.ఉద్యాన శాఖ అధికారి డి. రమేష్ గారు మిరప పంటలో కొమ్మ ఎండు మరియు కాయ కుళ్ళు తెగులునివారణకుచేపట్టవలిసిన సస్యరక్షణ చర్యల గురించి వివరిస్తూ టేబుకొనజిల్ 1మీ.లీ (లేదా)పైరాక్లో స్ట్రేబిన్ + మెటీరామ్3 గ్రాములు ను (లేదా) డేఫేనకొనజొల్ 0.5మీ. లీ నుఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయుట ద్వారా కాయ కుళ్ళును సమర్థవంతంగా నివారించవచ్చునని తెలిపారు.వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ J.సౌజన్య గారు మాట్లాడుతూ నిన్నటి నుండి 30.1.25 వరకు గ్రామాలలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ శిబిరాల్లో గేదెలు తిరిగి కట్టడం, గేదెలు మరియు దూడలలో సామూహిక నట్టల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు వేయడం మొదలగు వాటి గురించి అవగాహన కల్పించడం జరుగుతుందని పశుపోషకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో గ్రామ సహాయక సిబ్బంది దేవేంద్ర, బొర్రయ్య, మల్లికార్జున, మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.