

అర్హులైన వారికి పథకాలు అందుతాయి అధైర్యపడవద్దు తహశీల్దార్ -శ్రీలత
జనం న్యూస్ జనవరి 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలములోని తాళ్ళరాంపూర్ లోప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన నాలుగు గ్యారంటీల పథకంలో భాగంగా మంగళవారం రోజునాప్రజా పాలన గ్రామసభ భాగంగా ప్రత్యేక అధికారిగా డి ఎల్ పిఓశివ కృష్ణ, తహశీల్దార్ శ్రీలత, ఏఇఓమనీషా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.ఈ కార్యక్రమంలోరైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లపై ఈ సభ కార్యక్రమం అర్హులుపేర్లను గ్రామస్తుల ముందు చదివి వినిపించారు, రేషన్ కార్డులతో పాటు, వివిధ పథకాల్లో పేర్లు రాని వారు, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని డి ఎల్ పి ఓ శివకృష్ణప్రజలకు తెలియజేశారు, రైతు భరోసాల భాగంగా రైతులకురైతుబంధు పథకం క్రిందఎకరానికి12 వేల రూపాయలఇస్తుందనిమనీషా ఏఈవో చెప్పారు.తహశీల్దార్ శ్రీలతమాట్లాడుతూ మొత్తం ఈ గ్రామంలోభూమి 1192ఎకరాలు కాగా వ్యవసాయనికి యోగ్యాతలేని భూమి 7 ఎకరాల 20 గుంటలుగా గుర్తించాం అనిఅన్నారు. దీనిలో ఎటువంటి అబ్జెక్షన్స్ ఉంటే మాకు తెలియజేయగలరని కోరారు. ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలలో ఎవరికైతే అర్హత ఉంటుందోవారు కట్టుకోవడానికి స్థలం ఉంటే ప్రభుత్వ తరపున ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని అని మాట్లాడారు. ప్రజాపాలనలో రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారు మరియు మీ సేవా ద్వారా అప్లై చేసుకున్న మొత్తం మంది 205 వీటిలో అప్లై చేసుకున్న పేరు పేరు రాకపోయినా మరియు అప్లై చేసుకోకున్న మళ్ళీ అప్లై చేసుకోవచ్చునని అన్నారు.2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ కూలీగా20 రోజులపాటు పనిచేసిన వారికి పట్టేదారిగా ఒక్క గుంట భూమిలేని వారికి ఇందిరమ్మఆత్మీయ భరోసా వర్తిస్తుందన్నారు. ఈ పథకం క్రింద సంవత్సరానికి 12000రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలోగ్రామ పంచాయతీ కార్యదర్శి భోజన్న,రాజేశ్వరి సీనియర్ అసిస్టెంట్, బాల్కొండ బ్లాక్ అధ్యక్షుడు ఆడేం గంగా గంగా ప్రసాద్, బెజ్జారంభానుచందర్ , గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అవుల దేవన్న, అధికారులు, గ్రామప్రజలు పాల్గొన్నారు