

జనం న్యూస్ జనవరి(21) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో రైతు భరోసా, రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఆత్మ భరోసా మరియు ఇందిరమ్మ ఇల్లు పథకాలు అమలు కొరకు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని వారు మాట్లాడుతూ ప్రజాపాలనలొ నిజమైన పేద ప్రజలకు అన్ని పథకాలు అందుతాయని ఎవరికైనా పెట్టిన లిస్టులో పేరు లేదని ఆందోళన చెందకూడదని రాని వాళ్ళు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలియజేసినాడు. ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.