

జనం న్యూస్ జనవరి 21 నడిగూడెం అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తహశీల్దార్ సరిత తెలిపారు. మంగళవారంమండలంలోనివల్లాపురం, సిరిపురం, రామాపురం, బృందావనపురం, వేణుగోపాలపురం గ్రామాలలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించారు. రామాపురం గ్రామంలో జరిగిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ అర్హుల జాబితాలలో పేర్లు రానివారు అధైర్య పడవద్దని గ్రామసభల ద్వారా దరఖాస్తు ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారుల నుంచి సంక్షేమ పథకాలకు దరఖాస్తులను స్వీకరించారు. ఆయా గ్రామాలలో జరిగిన గ్రామ సభలలో ఎంపీడీవో సయ్యద్ ఇమామ్, ఎంపీఓ విజయలక్ష్మి, ఏవో దేవ ప్రసాద్, ఏపీఓ శ్రీనివాసరావు, ఏపీఎం రామలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లపురెడ్డి సురేందర్ రెడ్డి,మొక్క లక్ష్మీ వీణ బిక్షపతి, శెట్టి సతీష్, కాసాని వెంకన్న,బొడ్డు గోవర్ధన్, వేల్పుల సోమయ్య, కొల్లు నరసింహారావు, ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఏ.అశోక్ వర్మ, రాంపల్లి సతీష్, ఆర్.మల్లారెడ్డి, సి ఎచ్ విజయలక్ష్మి,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు…