Listen to this article

గిరి ప్రసాద్ ఆశయ సాధనకై కృషి చేయాలి – గుండె పిన్ని.

జనం న్యూస్,మే24, జూలూరుపాడు:

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు సిపిఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, జాతీయ మాజీ ఉప ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు నల్లమల్ల గిరి ప్రసాద్ 29వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో గిరి ప్రసాద్ చిత్రపటానికి పూలమాలవేసి సిపిఐ మండల కార్యదర్శి గుండే పిన్ని వెంకటేశ్వర్లు నివాళులర్పించారు అనంతరం గుండె పిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాది మందికి నిరుపేదలకు భూ పోరాటంలో భూమిని పంచిన మహనీయుడని, ఆయన పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు గిరిప్రసాద్ తన చివరి శ్వాస వరకు పేదల సంక్షేమం కోసం నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ పాలకవర్గాలపై అనేక ప్రజా పోరాటాల నిర్వహించారు, వారి ఆశయాల సాధనకై మనం ఉద్యమించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి, ఎస్ కె.నాగుల్ మీరా, సిపిఐ నాయకులు గార్లపాటి వీరభద్రం,ఎస్ కె.చాంద్ పాషా, చెరుకుమల రామకృష్ణ, కొట్టే శ్రీను,నిమ్మటూరి లచ్చయ్య, పత్తిపాటి మహేష్,దేవినేని రాము,శివ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.