Listen to this article

భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

మన భారత పుణ్యభూమి ఎంతో గొప్పదన్నారు

జనం న్యూస్, మే 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

ఆపరేషన్ సిందూర్ తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని, ధైర్య సాహసాలను కీర్తిస్తూ భారత సైనికులకు మద్దతుగా శనివారం నాడు గజ్వేల్ లో తిరంగా యాత్ర చేపట్టారు. కుల, మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పౌరులంతా పాల్గొని ర్యాలీని విజవంతం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మన సైన్యం గొప్పతనం నేడు ప్రపంచం అంత చెప్పుకోవడం, చూపించి ధైర్య సాహసాలు ఎంతో గొప్పవన్నారు. ప్రాణాన్ని పణంగా పెట్టి మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రతి సైనికుని పాదాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయిని సందీప్, శ్యామ్, సంపత్, చారి, మహేష్, కిష్టాగౌడ్, రేణుదాస్ పాల్గొన్నారు.