

బిచ్కుంద మే 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా
బిచ్కుంద మండల కేంద్రంలో విషాద ఘటన…
మంగలి సంగ్రామ్ s/o శంకర్ నివాసం బిచ్కుంద వాసి చిన్న కొడుకు అయినా మంగలి సునీల్ కు గత సంవత్సరం కిందట పెద్దతడుగురు గ్రామానికి చెందిన జ్యోతి అనే అమ్మాయితో పెళ్లి చేసినాడు ఈనెల 14వ తారీఖున జ్యోతికి శ్రీమంతం చేసి తన కొడుకుతో తన పుట్టినింట్లో దించి వచ్చినాడు తేదీ 23. 05. 2025 ఉదయం అందాజా 09 :00గంటలకు తిరిగి సునీల్ తన భార్య జ్యోతి నీ తన పుట్టిన ఇల్లు నుండి బిచ్కుంద వైపు తీసుకొస్తుండగా పెద్ద మైసమ్మ గుడి దగ్గరికి రాగానే ప్రమాదవశాత్తు తన భార్య బైక్ పై నుండి కింద పడి చనిపోయినది. ప్రభుత్వ ఆసుపత్రి నందు పోస్టుమార్టం పూర్తిచేసుకుని తిరిగి బిచ్కుందకు తీసుకొని వచ్చినాక తన కొడుకు సునీల్ తన భార్య మృతితో మనస్థాపం చెంది జీవితంపై విరక్తి చెంది బాత్రూం లోకి వెళ్లి యాసిడ్ తాగి బయటకు వచ్చి వాంతులు చేసుకోగా అక్కడ ఉన్న నేను మరియు మా బంధువు లు అదే అంబులెన్స్ లో గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేస్తుండగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నందు రాత్రి అందా జ 11: 30 గంటలకు మృతి చెందినాడు అని ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు