

(జనం న్యూస్ మే 24 చంటి)
ఐదు రోజుల నుండి ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం జిల్లా పరిషత్ బాలికల పాఠశాల దౌల్తాబాద్ లో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎల్. ఎఫ్. ఎల్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి మాట్లాడుతూ మండల స్థాయిలో తీసుకున్నటువంటి శిక్షణ పాఠశాల స్థాయిలో తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని సూచించడం జరిగింది విద్యార్థులకు వినూత్నమైన పద్ధతిలో ఎలా బోధించాలో బోధనలోని మెలకువలు ప్రాజెక్టులు, కృత్యాల, ద్వారా విద్యాబోధన ఎలా చేయాలో ఈ శిక్షణ ధార మనం తెలుసుకున్నాము ఇదే వినూత్నమైన పద్ధతిలో విద్యార్థులకు విద్యను అందించాలని మండల విద్యాధికారి సూచించారు. అదేవిధంగా చివరి రోజున జిల్లా రిసోర్స్ పర్సన్లు హరిదాస్ భాస్కర్ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఉత్సాహవంతంగా పాల్గొన్న ఉపాధ్యాయులకు మరియు రిసోర్స్ పర్సన్ లకు మండల విద్యాధికారి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిసోర్స్ త్యాగరాజు, శివకుమార్, మెహరాజ్ బేగం, వేణుగోపాల్, సర్దార్ హుస్సేన్, అనిత, ప్రశాంత్ రవి పాల్గొన్నారు.
