

లిప్ట్ ద్వారా 5000 ఎకరాలకి శాశ్వతంగా సాగునీరు
రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి
నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనం న్యూస్ మే 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం అనంతగిరి మండలం శాంతినగర్ లోని పాలేరు వాగుపై 52 కోట్ల రూపాయలతో నిర్మించే రాజీవ్ శాంతి నగర్ ఎత్తి పోతల పథకంను మంత్రి పరిశీలించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చే శాంతి నగర్ లిప్ట్ ని ప్రారంభించటం జరిగిందని 2016 తరువాత లిప్ట్ పని చేయటం లేదని గత ఆగస్టు 30 న వచ్చిన వరదతో పుంపు హౌస్ దెబ్బ తినదని తెలిపారు.ఎంత పెద్ద వరద ఉదృతినైనా తట్టుకునేలా శాశ్వతంగా ఉండేలా గత పంపు హౌస్ కంటే 3 మీటర్ల ఎత్తులో రాజీవ్ శాంతి నగర్ లిప్ట్ నిర్మించటం జరుగుతుందని దీని ద్వారా అనంతగిరి మండలంలోని 7 గ్రామాలలో 3129 ఎకరాలు, కోదాడ మండలం లోని 3 గ్రామాల పరిధిలో 1781 ఎకరాలు మొత్తం 5000 ఎకరాలు తీవ్ర కరవు వచ్చిన పాలేరు వాగు నుండి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకొని రావటం జరుగుతుందని తెలిపారు. పాలేరు రిజర్వాయర్ కి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు,అలాగే మున్నేరు నీరు ని పాలేరు కి తరలించి సాగు నీరు వదలటం జరుగుతుందని తెలిపారు.శాంతి నగర్ లో పాలేరు వాగుపై ఇప్పుడు ఉన్న చెక్ డ్యామ్ వల్ల ఉపయోగం లేదని మరొక చెక్ డ్యామ్ నిర్మిస్తామని అన్నారు. రైతులకి పైపులు భూమికింద నుండి పోయిన నష్టపరిహారం చెల్లిస్తామని, ఎత్తి పోతల పథకానికి, చెక్ డ్యామ్ కి రాజకీయాలకి తావు లేకుండా రైతులు సహకరించాలని మనం అందరం కలిసి అద్భుతమైన ఎత్తిపోతల పథకం నిర్మించుకుందాము అని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ సి ఈ రమేష్ బాబు,ఆర్డివో సూర్యనారాయణ, తహసీల్దార్ హిమబిందు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
