Listen to this article

జనంన్యూస్. 25. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే మూడు మాసాలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డులు కలిగిన వారు ఒకేసారి పొందవచ్చని అన్నారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, చౌక ధరల దుకాణ డీలర్లు మూడు మసాల కోటాను దిగుమతి చేసుకుని వినియోగదారులకు సకాలంలో బియ్యం కోటా పంపిణీ చేయాలని సూచించారు. జూన్ 01 నుండి 30వ తేదీ లోపు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. బియ్యం పంపిణీలో అవకతవకలు, అలసత్వానికి తావిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వానాకాలం సీజన్‌లో సంభవించే వర్షాలు, వరదలు, నిల్వ సమస్యలు తదితర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రేషన్ దుకాణాలకు సకాలంలో బియ్యం నిల్వలు చేరుకునేలా, కార్డు హోల్డర్లకు వారి కోటా మేరకు ఏకకాలంలో మూడు నెలల పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు సరుకులు సక్రమంగా తరలించేలా, బియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు