Listen to this article

జనం న్యూస్, మే 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణ కేంద్రంలో తిరంగా ర్యాలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ పట్టణ కేంద్రంలో గల అంగడి హనుమాన్ దేవాలయం వద్ద జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీ ప్రారంభమై ఇందిరా పార్క్ చౌరస్తా మీదుగా పిడిచెడు రోడ్డులో గల వివేకానందుడి విగ్రహం ముందు నుండి మున్సిపల్ కార్యాలయం వద్ద ముగింపు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ సీనియర్ నాయకులు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, తిరంగ యాత్ర కో కన్వీనర్ గర్నేపల్లి కృష్ణమూర్తి, బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్,మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రవాదులను దేశ మహిళా మూర్తుల నుదుటన సింధూరాన్ని దూరం చేసినందుకు ఆపరేషన్ సింధూర పేరిట పాకిస్తానీ ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చడం జరిగిందన్నారు. మహిళల భర్తలను చంపి మోడీకి చెప్పుకో అన్నందుకు నరేంద్ర మోడీ పాకిస్థానీ ఉగ్రవాదులకు మహిళా జవాన్ల తోటే ఉగ్రవాదాలను హతమార్చారు అన్నారు. భారత సైన్యానికి చేస్తున్నటువంటి కృషికి ప్రజలందరూ ఎన్నటికీ రుణపడి ఉంటామన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇది కేవలం ట్రయల్ మాత్రమే ముందుంది అసలైన యుద్ధమని అన్నారు.. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ రాష్ట్ర నాయకులు ఏళ్ళు రామిరెడ్డి,ఎరుపుల వెంకటరమణ, నలగామ శ్రీనివాస్, నందన్ గౌడ్, గురవారెడ్డి సింగం సత్తయ్య, కుడిక్యాల రాములు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఇర్రి ఉమా, నియోజకవర్గ నాయకులు బండారి మహేష్,నియోజకవర్గ మండలాల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్,మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్, కొండపాక నీల సత్యం, ములుగు లక్ష్మణ్ గౌడ్, జగదేపూర్ ఐలయ్య యాదవ్, కుకునూరుపల్లి సంపత్ రెడ్డి, వర్గల్ తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్ గర్నెపల్లి కృష్ణమూర్తి పెండ్యాల శ్రీనివాస్ మన్నె శ్రీనివాస్ శ్రీరామ్ శ్రీకాంత్ వెంకట్ రెడ్డి నత్తి శివకుమార్, బారు అరవింద్, నాయని సందీప్, మహిళా నాయకురాలు కట్ట భాగ్యలక్ష్మి సుమతి రాణి ,మమత భక్తమాల, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివిధ మోర్చాల నాయకులు మహిళ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.