Listen to this article

జనం న్యూస్ జనవరి 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : అనకాపల్లి గవరపాలెం గౌరీ పరమేశ్వరుల మహోత్సవం ఈనెల 25న శనివారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష్ అప్పారావు నాయుడు తెలిపారు. గౌరీ పరమేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 22వ తారీఖున బుధవారం ఆలయం వద్ద ఈ గౌరీ పరమేశ్వరుల వార్షిక కళ్యాణం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు భారీ సారి ఊరేగింపు జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా సుమారుగా 40 భారీ స్టేజ్ ప్రోగ్రాములు , నేలవేషాలు కలకత్తా వారిచే భారీ విద్యుత్ అలంకరణ, మందు గుండు సీతారామయ్యగారిచే భారీ బాణాసంచా కార్యక్రమం జరుగునని అలాగే మల్ల జగన్నాథ్ కల్యాణ మండపంలో గురువారం ఉచిత మెడికల్ క్యాంపు జరుగుతుందని పండగ రోజు భక్తులు సహాయ సహకారాలతో ఉచిత ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొణతాల మురళీకృష్ణ, చైర్మన్ కొణతాల సంతోష్ అప్పారావు నాయుడు, కార్యదర్శి కొణతాల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కొణతాల వెంకట వరప్రసాద్,కోశాధికారి కొనతాల మహాలక్ష్మి నాయుడు, ఉప కోశాధికారి పెంటకోట వెంకట సత్యనారాయణ,సహాయ కార్యదర్శి పివి రమణ, సహాయ కార్యదర్శి దాడి కృష్ణ, కన్వీనర్ మద్దాల శంకర్రావు, కన్వీనర్ మారిశెట్టి నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.//