

జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, డ్వామా కార్యక్రమాలపై ఆమె సమీక్ష జరిపారు.
కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, MP కలిశెట్టి అప్పలనాయుడు, MLA లు కిమిడి కళా వెంకట్రావు, కొండ్రు మురళీ మోహన్, కోళ్ల లలితకుమారి, లోకం నాగమాధవి, తదితరులు పాల్గొన్నారు