Listen to this article

జనంన్యూస్ 26. నిజామాబాదు. ప్రతినిధి.

ఇటీవలి కాలంలో తెలంగాణలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, IPS., ఆదేశాల మేరకు, అగ్నిప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితులపట్ల హాస్పిటళ్లలో భద్రతా చర్యల అమలును పరిశీలించేందుకు సంయుక్త తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేయడమైంది. బృందం సభ్యులు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) జిల్లా అగ్నిమాపక శాఖ నిజామాబాద్ పోలీసు శాఖ ప్రతినిధులు

    తనిఖీ చేయబడినా హాస్పిటళ్లు.

    1) పృడెన్స్ హాస్పిటల్

    2) టక్శ్ హాస్పిటల్

    3) మెడికోవర్ హాస్పిటల్

    తనిఖీ వివరాలు:

    బృందం ప్రతి హాస్పిటల్‌ లో ప్రామాణిక తనిఖీ జాబితా (checklist) ఆధారంగా పరిశీలనలు జరిపింది. తనిఖీల్లో కొన్ని లోపాలు గుర్తించబడ్డాయి, ముఖ్యంగా అగ్నిప్రమాద నివారణ పరికరాల నిర్వహణ, అత్యవసర నిష్క్రమణ మార్గాల నిర్దిష్టత, మరియు సిబ్బంది అవగాహనలో లోపాలు ఉన్నట్టు వెల్లడైంది. సూచనలు:
    గుర్తించిన లోపాలను తక్షణమే సరిచేసి, అగ్నిప్రమాద భద్రతా నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ నిర్వాహకులకు సూచించబడింది.