

జనం న్యూస్ మే 27
సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పట్టణమునకు నూతన డిఎస్పీగా ప్రభాకర్ పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బిజెపి జిల్లా కార్యదర్శి టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బైండ్ల కుమార్ మాట్లాడుతూ అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని శాంతి భద్రతలను కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంగడి బాలరాజు దిశాకమిటీ మెంబర్ కే.సుజాత పాల్గొన్నారు.