

జనం న్యూస్ 22 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా
ఎమ్మెల్యే సతీమణి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన ఎమ్మెల్యే సతీమణి ఈరోజు గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండల కేంద్రము మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గద్వాల ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి హెల్పింగ్ హ్యాండ్స్ (సహాయం చేసే చేతులు) చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మల్డకల్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఎమ్మెల్యే సతీమణి పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.ఎమ్మెల్యే సతీమణి గారిని హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకులు శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఎమ్మెల్యే సతీమణి చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను అందజేయడం జరిగింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ నేడు గద్వాల జిల్లా వ్యాప్తంగా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలలలోని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్టడీ మెటీరియల్ ఇవ్వడమనేది చాలా మంచి నిర్ణయం తీసుకున్న అని తెలిపారు.పాఠశాల మరింత అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు అందించి అని తెలిపారు.ఎమ్మెల్యే సతీమణి మాట్లాడుతూ.నేడు గద్వాల జిల్లా వ్యాప్తంగా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో మండల ప్రభుత్వం ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ నా చేతుల మీదుగా ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఇలాగే అనునిత్యం మీ సేవలు సమాజానికి ఉపయోగ పడాలని కొనియాడారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు గణితం, సోషల్, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ స్టడీ మెటీరియల్ ను మేటి అనుభవం కలిగిన రచయిత లతో తయారు చేయించి ఇవ్వడం జరుగుతుందని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా మన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మన జిల్లాకు మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా రాయాలని రాభోయే పరీక్షలను మన విద్యార్థులు మంచి మార్కులతో ప్రతిభ చూపడం కోసం స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతుందని కోరారు. పాఠశాలల అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా ఎమ్మెల్యే గారి కృషి చేయడం జరుగుతుందని. విద్యారంగంపై ప్రత్యేక దృష్టిని పెట్టమని. మన ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలలను అన్ని హంగులతో ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గద్వాల ఉన్నత పాఠశాలలను ప్రవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తామని తెలిపారు. త్వరలో జరగబోయే పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించి మీ తల్లిదండ్రులకు పాఠశాలకు గద్వాల ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకులకు రత్నం సింహా రెడ్డి దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ యాకోబు, నాయకులు నరేందర్, మధు నాయకి, తిమ్మరాజు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.