

జనంన్యూస్. 27. సిరికొండ. ప్రతినిధి.
ఆపరేషన్ సింధూర్ వివరాలు భారత ప్రజలకు తెలియజేయాలి.
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు.
పహల్గాం లో పర్యాటకుల హత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న నిజాలు భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిరికొండ మండల కేంద్రంలో పార్టీ కమిటీ సమావేశం నిర్వహించారు అనంతరం దాసు మట్లాడుతూ భారతదేశ నా మాతృభూమి దేశ ప్రజలందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటూ ప్రతిజ్ఞ చేసి అధికారాన్ని అధిష్టించిన నరేంద్ర మోడీ గారు దేశంలో జరుగుతున్న వాస్తవాలను నిర్భయంగా ప్రకటించటంలో ఎందుకు ఆలోచిస్తున్నారని అడుగుతున్నాం. పాకిస్తాన్ టెర్రరిస్టులు దేశ ప్రజల్ని చంపినారని మీరు ప్రకటించగానే దేశమంతా రాజకీయాలకు అతీతంగా ఒక్కటై మీకు అండగా నిలిచింది. కానీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు నిజాలు చెప్పకుండా, అమెరికా సామ్రాజ్యవాద దేశ అధ్యక్షులు ట్రంపు గారి ఆదేశాన్ని పాటించడం అనేక అనుమానాలకు దారితీస్తోందని దాసు అన్నారు. భారతదేశ ప్రజాస్వామిక స్వతంత్ర దేశం.
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశం. సువిశాల భారతంలో శ్రామిక సంపదలతో పాటు, జల,ఖనిజ, ప్రకృతి వనరులు కలిగి, రత్న గర్భమని పేరుగాంచిన దేశం.భారత ప్రజల ప్రయోజనాలను ఎవరు దెబ్బతీసిన ప్రశ్నించి, పోరాడే శక్తి ఉన్న దేశం. అట్లాంటప్పుడు ఆకారణంగా ప్రజల్ని చంపి, భయభ్రాంతులకు గురిచేసి టెర్రరిస్టులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించవలసిందేనీ ఆయన అన్నారు. పహల్గామ్ లో 4000 యాత్రికులు ఉండే పాన్ ప్రాంతంలో భద్రత ఎందుకు కరువైందని ఆయన ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న నిజాలను బహిర్గతం చేయలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1991 వరకు స్నేహంగా ఉన్న భారత్ను తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం అమెరికా సామ్రాజ్యవాదం అనేక ఎత్తులు వేసిందని ఆయన తెలిపారు. వెనుకబడిన దేశాలను, అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థ పై ఆదిపత్యం కొనసాగించడానికి అమెరికా సామ్రాజ్యవాదం చేసే కుట్రలను, దిగజారుడు విధానాలను ఒక దళారి ..పశ్చాత్తాపం.పుస్తకాన్ని చదివితే స్పష్టంగా అర్థమవుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, దేశాన్ని కాషాయీకరణ చేయడం కష్టపడుతున్నాడని, వాట్సాప్ యూనివర్సిటీ ఏర్పరిచి అసత్యాలతో ప్రజల్ని నమ్మించి కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. దేశ సంపదను, ప్రజలను,ప్రజాస్వామిక విలువలను కాపాడవలసిన బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం పై ఉందని ఆయన గుర్తు చేశారు.” దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న మహాకవి గురజాడ మాటల్ని అనేక సభల్లో ఉచ్చరించే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, మీరుచేస్తున్నది ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామిక దేశంలో ప్రశ్నించడమే నేరంగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్న, బిజెపి ప్రజల కోపాగ్నికి బలికాక తప్పదని ఆయన సూచించారు. దేశంలోని ప్రజలు నిరుపేదలుగా మారుతూ ఉంటే, అంబానీ, ఆదానీలు మాత్రం ప్రపంచ ధనవంతుల్లో చేరిపోయారని ఆయన తెలిపారు. దేశ సంపద పైన ప్రజలకు మాత్రమే హక్కు ఉందని, కార్పొరేట్ కంపెనీలకు కాదని ఆయన తెలిపారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజల ప్రయోజనాలను కార్పొరేట్ కంపెనీలకు, బహుళ జాతి సంస్థలకు తాకట్టు పెట్టడం భావ్యం కాదని ఆయన అన్నారు. కార్మికుల, రైతుల, ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే, పాలకులకు వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టి ముందుకు సాగుతామని దాసు తెలిపారు. ఈ సమావేశంలో భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి. బాలయ్య, శంకర్, ఏ ఐ కె ఎమ్ ఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి మార్క్స్, పి వై ఎల్ సిరికొండ మండల అధ్యక్షులు సంజీవ్,నాయకురాలు సాకలిగంగన్న,తదితరులు పాల్గొన్నారు.
