

జనం న్యూస్ రిపోర్టర్ నర్సంపేట 28-05-2025
27/05/2025(మంగళవారం )రోజున తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో యందు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల ప్రగతి చక్రంఅవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నర్సంపేట డిపో లో పనిచేస్తున్న ఉద్యోగులు కండక్టర్లు సంతోష్,స్రవంతి, రమేష్, సుమీల మరియు డ్రైవర్ అశోక్ రెడ్డి, మెకానిక్ రవి, రమేష్ లకు డ్యూటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చి డిపో ఆధాయానికి కృషి చేసినందుకు ప్రగతి చక్రం అవార్డు ప్రశంసా పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ సంతోష్ , MF ప్రభాకర్ , సూపర్వైజర్లు మరియుడిపో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
