

జనం న్యూస్ మే 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం ఎస్సై జక్కుల పరమేశ్వర్ తన సిబ్బందితో కలిసి మందారిపేట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్కడే ఉన్న బస్టాండ్ వద్ద ఒక వ్యక్తి అనుమానస్పదంగా కనిపించగా వెంటనే అతని వద్దకు వెళ్లి విచారించి, తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న బ్యాగ్ లో మొత్తం 6.085 కిలోల ఎండు గంజాయి లభించిందని దాని విలువ సుమారు 3,10,000/- రూపాయలు ఉంటుందని వెంటనే పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితుడి వివరాలు తెలుసుకోగా అతని పేరు సయ్యద్ షారుఖ్ జాకీరుద్దీన్ అహ్మద్ తండ్రి జాకీరుద్దిన్, 29 సంవత్సరాలు గ్రామ దత్ టెంపుల్, చంద్రాపూర్, మహారాష్ట్ర చెందిన వ్యక్తి అని తెలిసినది అతను అక్రమంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో ఒరిస్సా కి చెందిన జితేంద్ర కుమార్ అను వ్యక్తి దగ్గర గంజాయిని తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకి అమ్ముకొనేవాడు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి పంపగా జితేంద్ర కుమార్ అనే నిందితుడు పరారిలో ఉన్నట్లు పరకాల సిఐ పి రంజిత్ రావు తెలిపారు……