

జనం న్యూస్ మే 27 ఆసిఫాబాద్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామంలో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు ఓ లేగ దూడ బావిలో పడింది.ఈ గ్రామానికి చెందిన యువకులు గమనించి గ్రామపెద్దలకు సమాచారం అందించడంతో, బావి వద్దకు చేరుకున్న గ్రామ పెద్దలు అతి కష్టం మీద బావిలోంచి దూడను బయటకు తీశారు. దూడ ప్రాణాలు కాపాడిన వారికి యజమాని సుధాకర్ కృతజ్ఞతలు తెలిపాడు.అనంతరం గ్రామస్తులు, యువకులు మాట్లాడుతూ మన చుట్టుపక్కల జంతువులను మనం దయతో చూసుకోవాలని అన్నారు. వారికి కావల్సిన సహాయం చేయాలని,జంతువుల పట్ల దయను పెంపొందించడానికి, వారిని కాపాడేందుకు మనకు వీలైనంత సహకారం అందించాలని తెలిపారు. మూగ జంతువుల పట్ల దయతో వ్యవహరించడం మానవత్వం యొక్క ఒక భాగం, జంతువుల సంక్షేమానికి కృషి చేయడం ద్వారా, మన సమాజం మరింత మంచి కరుణాత్మకమైన సమాజంగా మారుతుందని పేర్కొన్నారు.
