

జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- గోపాల్ నగర్ నుండి ముళ్ల కత్వ వరకు ఏర్పాటు చేసే డ్రైనేజీ పైపులైను గోపాల్ నగర్ కాలనీ దగ్గర వచ్చేసరికి కొంతమంది ఫ్లాట్ యజమానులు మా స్థలము నుండి పైప్ లైన్స్ ఏర్పాటు చేయొద్దని అభ్యంతరం చేస్తున్నారని గోపాల్ నగర్ కాలనీ వాసులు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి తెలిపారు. ఈరోజు గోపాల్ నగర్ కాలనీకి వెళ్లి పరిశీలించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గోపాల్ నగర్ లేఅవుట్ గుండ వెళుతున్న రోడ్డు వాటర్ వర్క్స్ సంబంధించిందని, అంతేకాకుండా జిహెచ్ఎంసి లో రెండు వందల ఫీట్లు గా మాస్టర్ ప్లాన్ లో గుర్తించారు. కాబట్టి ఈ పైపులైను ఏర్పాటు కు అంతరాయం కలిగించిన వారిపై తగిన చర్యలు తీసుకుని వచ్చే వర్షాకాలం లోపల పనులు పూర్తి చేయాలని అధికారులు తెలిపారు. ఇట్టి పనులకు ఎవరైనా అంతరాయం కల్పించినట్లయితే వారు వారి డాక్యుమెంట్లు టౌన్ ప్లానింగ్ వారు వారి డాక్యుమెంట్లు పరిశీలించి, కూకట్పల్లి ఎమ్మార్వో, మియాపూర్ ఎమ్మార్వో ని సంప్రదించి తగిన మార్కింగ్ ఇవ్వాలని అధికారులను కోరారు. పైప్ లైన్స్ నిర్మాణం పనులు ఆపినట్లైతే మియాపూర్ పీఎస్ లో కంప్లైంట్ చేయాలనీ , ఈ డ్రైనేజీ పైప్ లైన్లు వలన గోపాల్ నగర్ కాలనీ వారికి ఎంతో ఉపయోగ పడుతుంది అని, కావున అసోసియేషన్ వారందరూ కలిసి ఇట్టి పనులు పూర్తయ్యాలాగా అధికారులకి సహకరించాలని గోపాల్ నగర్ వాసులను యం.ఎల్.ఎ కోరారు. అలాగే కూకట్పల్లి ఎంఆర్ఓ మియాపూర్ ఎమ్మార్వో తో కలిసి సర్వే చేసి తగిన విధంగా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ వారికి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు
ఈ కార్యక్రములో కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు. యం.ఆర్.ఓ స్వామి, హెచ్ ఎమ్ డబ్ల్యు ఎస్ ఎస్ బి
జి.యం ప్రభాకర్, టౌన్ ప్లానింగ్ ఏ సి పి రమేష్, డి.ఈ శంకర్, నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు