

, జనం న్యూస్: మే 29 ముమ్మిడివరం ప్రతినిధి
కేంద్ర మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత విజయవాడ శాసనసభ్యులు సృజనా చౌదరిని బిజెపి రాజనగరం నియోజకవర్గం ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి హైదరాబాదు లోని సృజనా చౌదరి స్వగృహంలో ఆయనను కలుసుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ గాయపడ్డ సుజనా చౌదరి హైదరాబాద్ వచ్చి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వెళ్లిన వీరన్న చౌదరి ఆయనను స్వయంగా కలుసుకొని పరామర్శించారు. కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకొని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని వీరన్న చౌదరి ఆకాంక్షించారు.