

జనం న్యూస్ మే 29 ముమ్మిడివరం ప్రతినిధి
అంబాజీపేట మండలం గంగలకురు,ముసలపల్లి గ్రామంలో పవిత్రమూర్తి అహల్యాబాయ్ హోల్కర్ 300 వ జయంతి కార్యక్రమాలు మండల ఇంచార్జ్ కంముజు శ్రీనివాస్ అధ్యక్షతనముఖ్యఅతిథిలుగా నియోజవర్గ కన్వీనర్ చీకురుమేల్లి వెంకటేశ్వరరావు, జిల్లా జనరల్ సెక్రెటరీ గనిశెట్టి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమం ఇంచార్జ్ మహిళా మోర్చా బిజెపి మోకా ఆదిలక్ష్మి. పాల్గొని ఈ కార్యక్రమంలో, ఈ కార్యక్రమంలో గనిశెట్టి వెంకటేశ్వరరావు *మాట్లాడుతూ అహల్యాబాయ్ యొక్క చరిత్రను తెలియజేస్తూ 300 సంవత్సరాల క్రితమే మహిళలు చైతన్యపరిచి వారికోసం అనేక కార్యక్రమాలను రూపొందించి దేశ సంస్కృతిని కాపాడినటువంటి పవిత్ర మూర్తి గూర్చి అందరికీ తెలియచేశారు. అలాగే మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని చైతన్యవంతులు కావాలని ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెంది ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోనుమడతల కనకరాజు వర్మ రాజుగారు మరియు గ్రామ మహిళలు పాల్గొన్నారు.