Listen to this article

జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తు, నిష్పక్షపాతంగా ముందుకు వెళ్తున్న స్వతంత్ర టీవీ ఎల్లవేళలా ప్రజల పక్షాన ముందుకు వెళ్లాలని, కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. స్వతంత్ర న్యూస్ ఛానల్ యజమాన్యం ప్రచురించిన నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను, బండి రమేష్ చేతుల మీదుగా, పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానీకై క్షణం క్షణం అనుక్షణం కృషి చేస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో స్వతంత్ర న్యూస్ ఛానల్ నిష్పక్షపాతంగా ముందుకు వెళుతుందని, ఛానల్ యజమాన్యానికి, సిబ్బందికి, విలేకరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు విట్టల్ రెడ్డి, లక్ష్మయ్య ,హరిప్రసాద్ ,నయీమ్ తదితరులు పాల్గొన్నారు