Listen to this article

నిర్వహించిన డాక్టర్ మాదాడి శ్రీదేవి..

జనం న్యూస్ 29 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)

ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం రోజున డాక్టర్ మాదాడి శ్రీదేవి ఆధ్వర్యంలో ఆయుష్ విభాగం యోగా శిక్షణ దారుడు సాతూరి చంటి ఎల్కతుర్తి గ్రామపంచాయతీ ఆవరణంలో యోగా శిక్షణ తరగతులు నిర్వహించి ఈ తరగతులు మీ ఎల్కతుర్తి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ నేర్పే విధంగా కార్యాచరణ చేపట్టాం మీ భవిష్యత్తుకు పునాది డాక్టర్ మాదాడి శ్రీదేవి మాట్లాడుతూ. ఈ తరగతులు రోజు చేసే పనిలో ఒక భాగము మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా పనిచేస్తుంది దీన్ని మీరు తూచా తప్పకుండా రోజు ఒక గంట సమయం కేటాయించి మీరు చేసినట్లయితే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్న వాళ్లు అవుతారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఎన్ ఎం.కె. పుష్పలత, ఆశా వర్కర్లు ఈ. రజిత, జె రాధిక, ఏ. రమ, గొడిశాల వినయ్, గొడిశాల వజ్రమ్మ, జెట్టి కనకయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.