

యాదవుల ఐక్యత ప్రతి ఒక్కరి బాధ్యత: తగుళ్ల జనార్ధన్
జనం న్యూస్ జూన్ 1 మండలం పెన్ పహాడ్ :
యాదవులను ఐక్యత చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు తగుల జనార్ధన్ యాదవ్, రాష్ట్ర నాయకులు జటంగి వెంకట నరసయ్య యాదవ్ అన్నారు. జాతీయ అధ్యక్షుడు మేకల రాములు ఆదేశాల మేరకు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహర్షి డిగ్రీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. పలు మండలాల కమిటీల కు నియామక పత్రాలు అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యాదవులను అనుగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీతి నిజాయితీ గల యాదవ జాతి రాజకీయంగా వెనుకబడి ఉండడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో యాదవులు ఒక్కరు కూడా మంత్రిగా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. యాదవులంతా సంఘటితమై పోరాటం చేయాలన్నారు. యాదవ హక్కుల కు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి విద్యావంతులు కంకణం కట్టుకోవాలి అన్నారు. జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ఇచ్చే పిలుపు కు స్పందించాలని కోరారు. ముందుగా గొల్ల గట్టు చరిత్ర పుస్తకాలను ఆవిష్కరించారు. జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా సుంకరబోయిన వెంకన్న యాదవ్,ముఖ్య సలహాదారుడిగా కోడి శివ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడిగా కోడి సత్యనారాయణ యాదవ్, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా సుంకరబోయిన సతీష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడిగా గోండ్ర హరీష్ యాదవ్, పలు మండలాల కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరాల రమేష్ యాదవ్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవి యాదవ్, నకిరేకల్ మార్కెట్ డైరెక్టర్ ముత్తయ్య యాదవ్, జిల్లా కార్యదర్శి కమ్మల లింగయ్యయాదవ్, గోపి యాదవ్, గొర్ల అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు