Listen to this article

జనం న్యూస్ జూన్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఈనెల 3 నుం

చి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు మండల కేంద్రంలోని నవోదయ హై స్కూల్ లో శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత యోగ ధ్యాన శిక్షణ లో ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ ఆదివారం రోజున తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి తన శరీరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు స్నాన పానాధులు ఎలా అవసరమో మనసుని హృదయాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకునేందుకు ధ్యానం ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతాయని తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉచిత యోగ ధ్యాన శిక్షణ కార్యక్రమంలో యువకులు విద్యార్థులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ కోఆర్డినేటర్ ఎం శారద, జిల్లా కోఆర్డినేటర్ జి అచ్చయ్య, కే రమేష్, రాంబాబు, సత్యనారాయణ, సుధాకర్, సురేందర్ పాల్గొన్నారు……