Listen to this article

నూతన కాలమానిని ఆవిష్కరణ చేసిన మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్

జనం న్యూస్ జనవరి 22 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా:- ఉమ్మడి మాచారెడ్డి మండల మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నూతన కలమానిని ఆవిష్కరణ చేసిన మున్నూరుకాపు జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ
ప్రతి సంవత్సరం పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వాటిల్లో మొదటిది అని అన్నారు. క్యాలెండర్ అనే పదం లాటిన్‌ భాష నుంచి పుట్టింది. లాటిన్‌లో ‘క్యాలెండేరియమ్‌’ అంటే అకౌంట్‌ బుక్‌ అని అర్థం. అలాగే క్యాలెండా అంటే సంవత్సరంలో వచ్చే మొదటి రోజు అని అర్థం. అలా లాటిన్‌ పదానికి దగ్గరగా ఉండే అర్థం నుంచి క్యాలెండర్‌ అనే పేరుని పెట్టారు. అని తెలియచేసారు.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న క్యాలెండర్‌. గ్ర్రెగోరియన్‌ క్యాలెండర్‌. రోమ్‌ మొట్టమొదటి రాజు సంవత్సరానికి 300 రోజులను మాత్రమే పరిగణించి పది నెలలు ఉండే క్యాలెండర్‌ని తయారుచేశారట. దీంతో పంటలు వేయడానికీ, పండగలు చేసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడేవారట. తర్వాత నుమా పొంపిలుయస్‌ అనే రాజు 365 రోజులను పరిగణనలోకి తీసుకుని జనవరి, ఫిబ్రవరిని ఈ క్యాలెండర్‌లో కలిపారట. క్రీ.శ.1582 లో కొన్ని దేశాలు మినహాయించి ప్రపంచవ్యాప్తంగా గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ని అంగీకరించారట ఆ తరువాత 1873 లో జపాన్‌ 1917లో రష్యా , 1949లో చైనా ఇలా ప్రపంచమంతా గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ని అంగీకరించడం మొదలుపెట్టింది.
అనేక ముఖ్యమైన రోజులున్న క్యాలెండరులో 365 రోజుల్లో ఏ ఒక్క రోజు క్యాలెండరు డే అనేది లేకపోవడం విచిత్రం అని అన్నారు. కార్యక్రమంలో మండల మున్నూరుకాపు సంఘ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.