Listen to this article

అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో రేషన్ షాపుల పునః ప్రారంభ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఎన్డీయే కూటమి నేతలు గనిశెట్టి వెంకటేశ్వరరావు, ములికి విగ్నేశ్వర రావు ముఖ్య అతిథులుగా పాల్గొని రేషన్ షాపులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ అర్హులయిన ప్రతిఒక్కరికీ నిత్యావసరాలు అందచేయటమే తమ ప్రభుత్వ ధ్యేయం అని వివరించారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇంటికి రేషన్ను డీలర్ లు తీసుకుని వెళ్లి ఇస్తారని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు బియ్యం ఇతర నిత్యావసర వస్తువులను అందచేసారు. ఈ కార్యక్రమంలో బల్ల ఆనందం, శ్రీకాకుళపు రాధాకృష్ణ, అంకం నాగమల్లేశ్వరరావు, కట్ట అప్పారావు, ములికి వీర వెంకట సత్యనారాయణమూర్తి, పెచ్చెట్టి మల్లికార్జునరావు, జిలగం గౌరీ మల్లికార్జున రావు, ఇసుక పట్ల సత్యనారాయణ, యనమదల రాజ్యలక్ష్మి, మిద్దె నూతన రవిరాజు, యనమదల వెంకటరమణ మరియు ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.