

జనం న్యూస్ జూన్ 2 ( భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
భీమారం మండల కేంద్రంలోని సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమారం మండల బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కలగూర రాజకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణా తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరులను స్మరించుకుని జాతీయ జెండాను బస్టాండ్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పార్టీ జెండాను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ శాంతియుతంగా పార్లమెంటరీ పంథాలో కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనలో అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ నాయకత్వంలో సకల జనుల సంక్షేమాన్ని కొనసాగిస్తూ, సమస్త రంగాల్లో ప్రగతిని సాధిస్తూ, పదేండ్ల అనతికాలంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని అదే స్పూర్థిని కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా సాగే దిశగా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకొని అమలు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దాసరి మదనయ్య మాజీ ఎంపిటిసి ఆత్కూరి రాము మాజీ ఉపసర్పంచ్ దొంగిరి రాజలింగు లాజర్ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.