

సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..
జెకె బిఆర్ఎస్ యూత్ కాన్స్టెన్సీ ప్రెసిడెంట్..
జనం న్యూస్, జూన్ 2, కుమార్ యాదవ్, జమ్మికుంట )
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇల్లంతకుంట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు జెకె మాట్లాడుతూ.ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అన్ని రంగాలలో అన్యాయానాని చూసి సహించలేక తమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001లో టీఆర్ఎస్ స్థాపించారన్నారు.మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గాన్ని కేసీఆర్ అనుసరించి మహోద్యమాన్ని నిర్మించారని ,తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేశారని అన్నారు.అభివృధ్ధి,సంక్షేమం రెండు కండ్లుగా మహానేత కేసీఆర్ పదేళ్ల సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారన్నారు.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు,సుదీర్ఘ రాజకీయ,పాలన కేసీఆర్ తోనే సాధ్యమయిందని స్పష్టం చేశారు.రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ సుపరిపాలనను మరోసారి చేస్తూ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల నీవేష స్థలంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి మాజీ సర్పంచులు కంది దిలీప్ రెడ్డి ,పుట్టా రాజు , నేరెళ్ల దామోదర్, దబ్బెట రాజు, ధనుంజయ్, మురళి, తో పాటు తదితరులు పాల్గొన్నారు.
