Listen to this article

జనంన్యూస్. తర్లుపాడుమండలం. జనవరి 22 తర్లుపాడు మండలం ఉమ్మారెడ్డిపల్లి గ్రామంలో పశువైధ్య అధికారి డా.డి.విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహింంచారు పశువైద్య శిబిరం లో లేగ దూడలకు, పశువులకు మరియు గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులు తాపించడం జరిగింది. గర్భకోశ వ్యాధులు కలిగిన పశువుల్ని గుర్తించి వాటికి చికిత్స అందించారు, రైతులకు మరియు సన్నజీవాల కాపారులకి లాభసాటి పశువులు మరియు జీవాల పెంపకం గురించి వివరించి తీసుకోవలసిన జాగ్రత్తలు, మెలకువలు మరియు శాస్త్రీయ యాజమాన్య పద్ధతుల గురించి వివరించడం జరిగింది.అలానే పశువులకు మరియు జీవాలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవడం వల్ల లాభాలు టీకా ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మొత్తం 53 గెదలకి& దూడలు, 1310 సన్నజీవలకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో వి. ఏ బి.త్రినాథ్ రెడ్డి ఏహేచ్ ఏ గొలమారి పుణ్యవతి గ్రామ రైతులు తాడిచలమారెడ్డి తాడి అంజిరెడ్డి ఉమ్మారెడ్డి కొండారెడ్డి మరియు రైతులు సన్న జీవాల పెంపకదారులు పాల్గొనడం జరిగింది.