

ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చాలి
జనం న్యూస్ – జూన్ 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
ఎందరో అమరుల త్యాగ ఫలితం వందలాదిమంది విద్యార్థులు, అమరవీరుల పోరాట ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ రమేష్ జి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సరిహద్దు ప్రాంతమైన కొత్త బ్రిడ్జిపై జాతీయ జెండాను మరియు టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు, ఈ సందర్భంగా రమేష్ జి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమకారుల రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జానకి రెడ్డి, చంద్రమౌళి నాయక్ ,లక్ష్మణ్ నాయక్ ,శేఖర్ ఆచారి, పల్లవోలు శ్రీను, దాసరి హనుమంతు, పిట్టా సైదులు, రామస్వామి, అర్జున్ నాయక్, మంద శాంతకుమారి, గాజుల రాము, పిట్టా సైదులు, శ్రీను, ప్రసాద్, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.