

విజయవాడ తరలి వెళ్లిన వెదురుపాక జనసేన నాయకులు
జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం అంగర వెంకట్ జూన్ 3ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సోమవారం కూటమి శ్రేణులు అధిక సంఖ్యలో విజయవాడకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు లీలా కృష్ణ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెదురుపాక గ్రామ జనసేన నాయకులు నక్కా రాజు రాజేష్, వై.మురళి, కొప్పిరెడ్డి తాతాజీ,అమజాల శ్రీనివాసు,వేల్పూరిగణేష్, చుక్కగోవింద్ తదితరులు పాల్గొన్నారు.