

జనం న్యూస్ జూన్ 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోనీ రైతు వేదికలో ఎంపిక చేసిన రైతులకు ఆర్టీఏ మెంబర్ లావుడ్య రమేష్,పాక్స్ చైర్మెన్ కర్నతం సంజీవ్ కుమార్,పాక్స్ వైస్ చైర్మన్ రంగు మహేష్ గౌడ్,మండల వ్యవసాయ అధికారి దిలీప్ లతో కలసి ఉచిత వరి,పెసర, కంది విత్తనాలను రైతులకు అందజేశారు.ఆర్టీఏ మెంబర్ లావుడ్య రమేష్ మాట్లాడుతూ రైతును రాజును చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం, అందులో భాగంగా రైతులు విత్తనాలను స్వయంగా ఉత్పత్తి చేసుకొనేల ప్రోత్సహిస్తుందని నాణ్యమైన విత్తనాలతో రైతులు అధిక ఉత్పత్తి సాధించి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలోఏవో ఏ లు రాకేష్,సంజీవ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గం దేవాజీ,మాజీ ఎంపీటీసీ మోర్లే రఘుపతి,రైతులు పాల్గొన్నారు